Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిరుల తల్లి శ్రీలక్ష్మి ఆశీస్సుల కోసం వంటగదిలోని ఈ పదార్థాలను వాడితే?

Advertiesment
Lakshmi Devi

సెల్వి

, బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (18:54 IST)
సిరుల తల్లి శ్రీదేవి లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడం వల్ల ఇంట శ్రేయస్సు, సంపద, అదృష్టం చేకూరుతాయి. మీ కృషికి సానుకూల ప్రకంపనలను సృష్టించడంలో సహాయపడతాయి. డబ్బు, శ్రేయస్సును ఆకర్షించడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. లక్ష్మీ దేవిని ఆకర్షించడానికి మీ ఇంటికి శ్రేయస్సు తీసుకురావడానికి మీ వంటగదిలో లభించే కొన్ని పదార్థాలేంటో తెలుసుకుందాం. 
 
తులసి
తాజా తులసి సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మీ ఇంటి గుమ్మం దగ్గర తులసి మొక్కను ఉంచండి లేదా వంటలో వాడండి.
 
దాల్చిన చెక్క
ఈ సుగంధ ద్రవ్యం సంపద, అదృష్టాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీనిని మీ పర్సులో ఉంచండి. దాల్చిన చెక్క పొడిని పర్సులో చిన్న పేపర్లో మడిచి పెట్టండి. అలాగే ఇంటి చుట్టూ చల్లడం ద్వారా శ్రీలక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుంది. 
 
అల్లం
తాజా అల్లం అదృష్టం, శ్రేయస్సును సంపాదించి పెడుతుంది. అల్లంను పచ్చిగా తినండి లేదా వంటలో వాడండి. 
 
బిర్యానీ ఆకులు
బిర్యానీ ఆకులు సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకులపై కోరికలు రాసి కాల్చడం వల్ల ఆ కోరికలు నెరవేరుతాయని కొందరు నమ్ముతారు. 
webdunia
Kitchen ingredients
 
వరి
బియ్యం సమృద్ధి, సంపదకు చిహ్నం. మీ వంటగదిలో ఒక చిన్న గిన్నెడు ఉడకని బియ్యం ఉంచండి.
 
యాలకులు
ఈ సుగంధ ద్రవ్యం సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం, డబ్బును ఆకర్షించడానికి పర్సులో 5-7 యాలకులను ఉంచండి.

ఉప్పు
గదుల మూలల్లో లేదా వంటగది చుట్టూ ఉప్పు చల్లడం వల్ల అది ప్రతికూలతను దూరం చేసి శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీడీ సంచలన నిర్ణయం- 18మంది హిందూయేతర ఉద్యోగులపై బదిలీ వేటు