Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజగదిలో ఈ వాస్తు దోషాలు ఉన్నాయా? (video)

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (13:22 IST)
అనేక మంది ఇంట్లో అన్ని విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. పడక గది, వంటిల్లు, హాలు నిర్మాణాల్లో వాస్తుపరంగా ఆలోచన చేస్తారు. కానీ, పూజ గది విషయంలో మాత్రం అంతగా పట్టించుకోరు. కొందరు ప్రత్యేకంగా పూజ గదిని నిర్మించుకుంటే, మరికొందరు మాత్రం కిచెన్‌లోనే ఓ పక్క అల్మారానే పూజకు కేటాయిస్తారు. 
 
నిజానికి వాస్తు ప్రకారం పూజ గది ఇంట్లో ఈశాన్యం దిశలో ఉంటే మంచిది. అందువల్ల ఇంట్లో పూజ గది నిర్మాణంలో ఈ వాస్తు దోషాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ దోషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 
 
* పూజగ గదికి ఎదురుగా వాష్‌రూమ్ లేకుండా చూడాలి. ఈ రెండు ఎదురెదురుగా ఉంటే వాష్‌రూమ్ నుంచి దుర్వాసన వల్ల ఏకాగ్రత కోల్పోతారు. ఫలితంగా పూజ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. 
 
* ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నపుడో, కష్టాల్లో ఉన్నపుడో దైవుడుని ఆశ్రయిస్తారు. అలాంటి సమయంలో దేవుడు గదిలో ఎక్కువ విగ్రహాలు ఉండటం వల్ల ఏకాగ్రత కుదరకపోవడంతో ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల పూజ గదిలో పరిమిత సంఖ్యలోనే విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. అంటే పూజ గదిలో ఎక్కువ విగ్రహాలు లేకుండా చూడాలి. 
 
* పూజ గదిలో నలుపు, బూడిద, నీలం రంగులను వాడొద్దు. ఇవి డిప్రెషన్, నిరాశకు కారణమైన వైబ్రేషన్‌ను కలిగిస్తాయి. 
 
* జనపనారతో తయారు చేసిన ఆసనం మీద కూర్చొని పూజ చేయాలని వాస్తు శాస్త్ర చెబుతోంది. నిలబడి హడావుడి చేయడం కంటే ఎప్పుడూ కూర్చొనే పూజ చేయడం మంచిది. 
 
* పడక గదిలో ఓ మూలను పూజకు కేటాయిస్తే వెంటనే అక్కడ నుంచి మార్చాలి. పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. 
 
* దేవుడుకి పూజ చేసిన తర్వాత నైవేద్యం సమర్పించడం ఎంతో ముఖ్యం. పళ్లు, స్వీట్స్ వంటి వాటిని దేవుడుకి సమర్పించాలి. ఏవీ లేకపోతే కాస్త పంచదార అయినా సమర్పించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: పాపం ఊరికే పోదు.. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది.. రేవంత్ ఫైర్ (video)

UP: ఆంటీతో ప్రేమ.. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది.. అంతే గొంతు నులిమి చంపేశాడు..

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

అన్నీ చూడండి

లేటెస్ట్

వినాయక చవితి పండుగ తర్వాత గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు?

Bhagavad Gita: భగవద్గీత నిత్య సంజీవిని : డా ఎల్ వి గంగాధర శాస్త్రి

01-09-2025 సోమవారం ఫలితాలు - పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది...

01-09-2025 నుంచి 30-09-2025 వరకు మీ మాస గోచార ఫలాలు

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments