స్విమ్మింగ్ ఫూల్ అంటే నచ్చని వారుండరు. ఈ స్విమ్మింగ్ ఫూల్ ఇంటి పక్కనే ఉంటే.. ఎంత బాగుంటుందని కొందరు ఆలోచిస్తుంటారు. మరికొందరు ఇంటి కిందే ఉంటే.. ఎలా ఉంటుందోననే ఆనందంతో ఆలోచనల్లో పడిపోతుంటారు. ఆ ఆలోచనల మంచిదే.. కానీ, ఇంటి విస్తీర్ణం చేసిన విధానం దాని పిల్లర్స్‌ను బట్టి స్విమ్మింగ్ ఫూల్ ఇంటి కింద వేయడం కుదరదు. ముఖ్యంగా వాస్తుశాస్త్రం ప్రకారం నీటి గుంట మీద గృహం నిర్మించకూడదని శాస్త్రంలో చెప్పబడింది.
ఇల్లు కట్టేటపుడు పక్కన విశాలమైన స్థలంలో తూర్పు ఉత్తర దిశలలో ఖాళీ స్థలం వదిలి ఆ భాగాలలో స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాడుచేసుకోవచ్చు. కింద స్విమ్మింగ్ ఫూల్ ఇల్లు రావాలంటే ఇంటికి ఉత్తరంలో లేదా తూర్పులో అమర్చుకోచ్చును. అలాకాకుంటే లోడింగ్ కెపాసిటీ పెంచుకుని దక్షిణం, పడమర గదులు ఏర్పాటు చేసుకుని తూర్పు, ఉత్తర దిశలో స్విమ్మింగ్ ఫూల్ కట్టవచ్చు. కానీ, ఇంటి కింద మాత్రం ఎప్పటికి స్విమ్మింగ్ ఫూప్ నిర్మించుకూడదని వారు చెప్తున్నారు.