ఇల్లు కట్టాం. కానీ, ద్వారాలు మాత్రం మూడు పెట్టుకున్నాం.. అయితే ఏ ద్వారానికి గృహ ప్రవేశం ఎలా చేయాలని తెలియడం లేదు. కనుక వాస్తు ప్రకారం ఇలా చేస్తే సరిపోతుంది.. అంటే.. ముందుగా సింహద్వారం అని దేనిని అంటారని నిర్ధారణ చేసుకోవాలి. నాలుగు మూడు అని మనం భావించుకుంటే సరిపోదు. వీధి ఇంటికి ఎటువైపు ఉంటే ఆ దిశను బట్టి ఇంటిని తూర్పు గృహం, ఉత్తరం రోడ్డు దానిని ఉత్తరం ఇల్లు అనో అంటాం.
ప్రధాన వీధికి అభిముఖంగా ఉన్న ద్వారాన్ని సింహద్వారం అంటారు. అది గృహ యజమాని శారీరక అమరికకు అనుగుణంగా గృహ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఏ ఇంటికైనా తూర్పు-ఉత్తర ద్వారాలు వస్తుంటాయి. అవి కూడా ప్రధాన ద్వారాలే అవుతాయి. కానీ సింహద్వారాలు కావు. కాబట్టి ప్రధాన వీధిని అనుసరించి ఉన్న ద్వారానికి పూజాదికాలు చేసి గృహ ప్రవేశం చేయాలి.