Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : మీ రాశి ఫలితాలు 02-09-2017

మేషం : ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతాయి. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో కలసి ప్రయాణం చేయునప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుంది. స్త్రీ

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (05:49 IST)
మేషం : ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతాయి. రాజకీయాల్లో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో కలసి ప్రయాణం చేయునప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుతుంది.
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా సమసిపోగలవు. మార్కెటింగ్ రంగాల వారికి,  పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. ఎదుటివారితో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం.
 
మిథునం : మీ సంతానం ఉన్నతి కోసం కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణ విముక్తులుకావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. తలపెట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. ముఖ్యులతో మాట పట్టింపు వచ్చే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం : విందులలో పరిమితి పాటించండి. విద్యార్థులకు కొన్ని నిర్భంధాలకు లోనవుతారు. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. దూర ప్రయాణాలకై చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి.
 
సింహం: ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. విద్యార్థుల్లో పట్టుదల, విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. మీ ప్రత్యర్థులు వేసే పథకాలు ధీటుగా ఎదుర్కొంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ఆలోచన వాయిదా పడుతుంది. స్త్రీలకు ప్రతి విషయంలో ఓర్పు, విజ్ఞత ఎంతో అవసరం.
 
కన్య : ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండకపోవడంతో మనశ్శాంతి లభిస్తుంది. నిర్మాణ పనుల్లో పనివారితో సమస్యలు తలెత్తుతాయి. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రుణానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి మార్పులు అనుకూలం.
 
తుల : ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారస్తులకు సామాన్యం. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు, ఊహించని చికాకులు ఎదుర్కొంటారు. మిత్రుల కిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అధికంగా శ్రమిస్తారు.
 
వృశ్చికం: మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ స్నేహితుల పట్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.
 
ధనస్సు: ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది. భార్యాభర్తల ఆలోచనలు అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
 
మకరం: కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు.
 
కుంభం: భాగస్వామిక చర్చలు, స్థిరాస్తి వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అధిక శ్రమ తప్పదు. ఖర్చులు అధికం. అయినా సంతృప్తి ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణి వల్ల సదవకాశాలు జారవిడుచుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. వృత్తిరీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పెద్దల నుంచి ఆస్తులు సంక్రమిస్తాయి. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఖర్చులు అధికమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఎన్డీయే సమావేశంలో హాజరు.. వాటిపై చర్చ

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments