Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : మీ రాశి ఫలితాలు 01-09-17

మేషం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, ఇతరాత్రా ఒప్పందాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ శ్రీమతితో అకారణ కలహం, పట్టింపులు ఎక్కువ అవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. ఏజెం

Advertiesment
daily prediction
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (05:47 IST)
మేషం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, ఇతరాత్రా ఒప్పందాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ శ్రీమతితో అకారణ కలహం, పట్టింపులు ఎక్కువ అవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసివస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, మార్కెట్ రంగాల వారికి ఎంత శ్రమించినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. 
 
వృషభం : ఈ రోజు ఉన్నతాధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉడటం క్షేమదాయకం. ఉద్యోగ, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులు అల్లర్లు, సామాజిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. 
 
మిథునం : ఈ రోజు ఉద్యోగస్తులు, అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. వ్యాపారాల్లో నిలుదొక్కుకోవడానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సమస్యల పరిష్కారానికి సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు. ఫ్లీడర్లకు, వైద్యులకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం : ఈ రోజు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలు ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ముఖ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. 
 
సింహం : ఈ రోజు ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 
 
కన్య : ఈ రోజు స్త్రీలు పట్టువిడుపు ధోరణితో మెలగాలి. ఖర్చులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థులు అల్లర్లు, సామాజిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి యత్నించండి. 
 
తుల : ఈ రోజు ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. పెద్దల ఆరోగ్యం కలవరపరుస్తుంది. సోదరీ, సోదరులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. ఓర్పు, కార్యదీక్షతో పని చేసి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ఈ రోజు ధనంగా బాగా సంపాదించి దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. వైద్యులకు మెళకువ ఏకాగ్రత చాలా అవసరం. ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కొంతమంది మిమ్మలను ధన సహాయం అర్థించవచ్చును. గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడతాయి. 
 
ధనస్సు : ఈ రోజు ఆర్థిక స్థితి నిరుత్సాహం కలిగిస్తుంది. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. విదేశాలు వెళ్లే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉన్నతాధికారులు కొత్త వ్యక్తులను దూరంగా ఉంచాలి. 
 
మకరం : ఈ రోజు విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందటంతో పాటు తోటి విద్యార్థులతో పోటీపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. ఉపాధ్యాయుల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. 
 
కుంభం : ఈ రోజు ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. బ్యాంకుల్లో చికాకులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో హడావుడి ఉంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతాయి. 
 
మీనం : ఈ రోజు ప్రముఖుల కలయిక కోసం పలుమార్లు తిరగవలసి వస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. మీ వ్యవహారాలను స్వయంగా సమీక్షించుకోవడం ఉత్తమం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు నెల మీ రాశి ఫలితాలు... 01-09-2017 నుంచి 30-09-2017 వరకు(వీడియో)