Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభోదయం : మీ రాశి ఫలితాలు 31-08-17

మేషం : ఈ రోజు వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు ఆలయాల్లో సంద

శుభోదయం : మీ రాశి ఫలితాలు 31-08-17
, గురువారం, 31 ఆగస్టు 2017 (05:47 IST)
మేషం : ఈ రోజు వస్త్ర, బంగారం, వెండి ఫ్యాన్సీ వ్యాపారాల్లో పోటీతత్వం అధికంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు ఆలయాల్లో సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది.
 
వృషభం : ఈ రోజు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అరుదైన శస్త్ర చికిత్సలను డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మత్తులు చేపడతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
 
మిథునం : ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి.
 
కర్కాటకం : ఈ రోజు ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం.
 
సింహం : ఈ రోజు వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఇతరులకు మేలు చేసి అపవాదుల పాలవుతారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు.
 
కన్య : ఈ రోజు పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు హోదా పెరగడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి.
 
తుల : ఈ రోజు వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది.
 
వృశ్చికం : ఈ రోజు వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. మిమ్మల్ని పొడిగే వారే కానీ సహకరించే వారుండరు.
 
ధనస్సు : ఈ రోజు పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడటం వల్ల నిరుత్సాహానికి గురౌతారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కళత్ర ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతాయి.
 
మకరం : ఈ రోజు ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి.
 
కుంభం : ఈ రోజు స్వయంకృషితో రాణిస్తారు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి.
 
మీనం : ఈ రోజు బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు వాయిదా పడతాయి. బంధువుల ఆకస్మిక రాక మీకు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాబడికి మించిన ఖర్చులెదుర్కుంటారు. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : మీ రాశి ఫలితాలు 30-08-17