Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలెంటైన్ వీక్.. చాక్లెట్ డే రోజున ఇలా ప్రపోజ్ చేస్తే..?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (10:40 IST)
Chocolate Day
వాలెంటైన్ వీక్ ప్రారంభమయ్యింది. వరుసగా రోజ్ డే, ప్రపోజ్ డేలు గడిచిపోయాయి. ఇప్పటికీ తమ ప్రేమను చెప్పనివారు. చెప్పడానికి సంకోచించేవారు ఉండే ఉంటారు. చాకొలెట్స్ తింటే... మెదడు బాగా పనిచేస్తుంది. రోజూ రెండు కప్పుల హాట్ చాకొలెట్ షేక్స్ తింటే... బ్రెయిన్ చురుగ్గా మారి... మెమరీ పవర్ పెరుగుతుందని హార్వార్డ్ రీసెర్చ్‌లో తేలింది. అలాంటి చాక్లెట్లతో ప్రేమను వ్యక్తపరచవచ్చు. 
 
మీ ప్రియమైన వారి పట్ల మీలో ఉన్న భావాలను చెప్పడానికి ఈ చాక్లెట్ డేను సరైన సమయంగా ఉపయోగించుకోవచ్చు. వాలెంటైన్ వీక్‏లో మూడవ రోజు అంటే ఫిబ్రవరి 9న చాక్లెట్ డేగా జరుపుకుంటారు ప్రేమికులు. ఈ రోజున రకారకాల చాక్లెట్లను ఇచ్చి తమవారి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు తమవారికి ఇష్టమైన చాక్లెట్లను ఇచ్చి వారిని సంతోషపెడుతుంటారు. 
 
సాధారణంగా వాలంటైన్స్ డే వస్తుందంటే రకరకాల ప్రేమ చాక్లెట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. వాటిలో రకరకాల డార్క్ చాకోలెట్లను ఎంచుకొని మీ ఆత్మీయులకు అందివ్వండి. ఆరోగ్యం ప్రకారం చూస్తే, డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి మంచిదిగా చెప్పబడుతుంది. 
 
అవేకాకుండా మానసిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడేవారికి కూడా డార్క్ చాక్లెట్ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ డార్క్ చాక్లెట్లలో కోకో ఎక్కువగా, పాలపదార్ధాలు తక్కువగా ఉంటాయి. క్రమంగా.. ఇందులో ఉండే కోకో ఆధారంగా డార్క్ చాక్లెట్ రుచి మారుతుంది.
 
"చాలా షాప్స్ తిరిగాను నీకంటూ ప్రత్యేకమైన చాక్లెట్ ఇవ్వడానికని.. కానీ నేను కనుగోనలేకపోయాను నీ నవ్వు కంటే తియ్యనైనా చాక్లెట్ ఎక్కడ ఉంటుందని.. హ్యాప్పీ చాక్లెట్ డే స్వీట్ హార్ట్.." అంటూ చాక్లెట్ డే రోజున ప్రపోజ్ చేస్తే.. ప్రియురాలు మీ ప్రేమను తప్పకుండా అంగీకరిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments