Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ రూపంలో బడ్జెట్ ప్రతులు.. మరికొన్ని నిమిషాల్లో వెల్లడి...

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (10:35 IST)
దేశ చ‌రిత్ర‌లో తొలిసారి కేంద్ర బ‌డ్జెట్ పేప‌ర్‌లెస్‌గా మారింది. క‌రోనా వేళ కేంద్ర బ‌డ్జెట్ డిజిట‌ల్‌ రూపంలోకి మారిపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ఈ ఏడాదికి సంబంధించిన బ‌డ్జెట్‌ను సోమవారం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 
 
అయితే ఈ సారి బ‌డ్జెట్‌ను ట్యాబ్లెట్‌‌లో పొందుప‌రిచారు. సాంప్ర‌దాయ‌క‌మైన‌ బ‌హీఖాతా పుస్త‌కం బ‌దులుగా.. లోక్‌స‌భ‌లో ట్యాబ్‌ ద్వారా మంత్రి 2021-22 బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపించ‌నున్నారు. ఎర్ర‌టి బ్యాగులో మేడిన్ ఇండియా ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ క‌నిపించారు. 
 
కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ‌మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మంత్రి సీతారామ‌న్‌తో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చేరుకున్నారు. పేప‌ర్‌లెస్ బ‌డ్జెట్‌గా గుర్తింపు పొందిన తాజా బ‌డ్జెట్‌కు సంబంధించిన సాఫ్ట్ కాపీని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. 
 
ఇకపోతే, రెడ్ క‌ల‌ర్ బ్యాగులో ట్యాబెల‌ట్‌ను పార్ల‌మెంట్‌కు తీసుకువెళ్లారు. ఆ బ్యాగుపై గోల్డ్ క‌ల‌ర్‌తో జాతీయ చిహ్నం ఉంది. ఎరుపు, క్రీమ్ క‌ల‌ర్ చీర‌లో సీతారామ‌న్‌.. పార్ల‌మెంట్‌కు వెళ్ల‌డానికి ముందు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వెళ్లారు. 2019లోనూ మోడీ సర్కార్ బ‌డ్జెట్ వేళ కొత్త సాంప్ర‌దాయాన్ని ఆరంభించారు.  
 
లెద‌ర్ బ్రీఫ్ కేసులో తీసుకువెళ్లే బ‌డ్జెట్ ప‌త్రాల‌ను.. ఆ ఏడాది ఆమె తొలిసారి బ‌హీఖాతా పుస్త‌కం రూపంలో తీసుకువెళ్లారు. మోడీ ప్ర‌భుత్వం సూట్‌కేసు మోసుకేళ్లే టైపు కాదంటూ మంత్రి సీతారామ‌న్ అన్నారు. ఎంపీలంద‌రికీ బ‌డ్జెట్ కాపీలు చ‌దువుకునేందుకు.. యూనియ‌న్ బ‌డ్జెట్ మొబైల్ యాప్‌ను మంత్రి సీతారామ‌న్ ఆవిష్క‌రించారు. చాలా సులువైన రీతిలో డిజిట‌ల్ విధానాన్ని రూపొందించారు.
 
కాగా, మంత్రి సీతారామ‌న్ ఇవాళ 11 గంట‌ల‌కు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతార‌ని, డిజిట‌ల్ రూపంలో ఆ బ‌డ్జెట్ ఉంటుంద‌ని, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల‌ను indiabudget.gov.in పోర్ట‌ల్ లేదా యూనియ‌న్ బ‌డ్జెట్ మొబైల్ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments