Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బడ్జెట్ 2021-22 : భారతీయ రైల్వేకు పెద్ద పీట వేసేనా?

బడ్జెట్ 2021-22 : భారతీయ రైల్వేకు పెద్ద పీట వేసేనా?
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (08:05 IST)
లోక్‌సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం పద్దు ప్రవేశపెడుతుందంటే అన్ని విభాగాల్లో భారీ అంచనాలు ఉంటాయి. అన్ని శాఖలు ముందస్తు సంప్రదింపుల్లో తమ ప్రణాళికలను ఆర్థిక శాఖకు వివరించి బడ్జెట్ కేటాయింపులు కోరుతుంటాయి. మరి ఈ సారి బడ్జెట్​కు రైల్వే శాఖ ఎలాంటి సూచనలు చేసింది? బడ్జెట్​లో రైల్వే కేటాయింపులపై అంచనాలు ఎలా ఉన్నాయి? కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ 2021-22ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. 
 
సోమవారం పద్దును పార్లమెంట్​ ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ బడ్జెట్​లో రైల్వే విభాగానికి కేటాయింపులు ఎలా ఉండనున్నాయి? రైల్వేకు గతంలో వేరుగా బడ్జెట్ ఉండేది. ఇప్పుడు యూనియల్ బడ్జెట్​లోనే రైల్వేకూ కేటాయింపులు జరగుతున్నాయి. భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు, సంరక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి బడ్జెట్​లో కేటాయింపులు భారీగా ఉండొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు. 
 
ఈ ఏడాది బడ్జెట్​లో 3-5 శాతం కేటాయింపులు పెరగొచ్చని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. మొత్తం ఈ సారి రూ.80 వేల కోట్ల కేటాయింపులు ఉండొచ్చని భావిస్తోంది. నేషనల్ రైల్​ ప్లాన్​ 2024ను కూడా బడ్జెట్​ పరిగణించే వీలుందని చెబుతోంది. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్​ కూడా కేటాయింపుల పెరుగుదలకు కారణం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ 2021 వ్యాక్సిన్ : హోదా, రైల్వే జోన్ అమలుపై కోటి ఆశలు!