Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ నుండి అమలులోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:59 IST)
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లను మరింత సరళతరం చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో మరింత పోటీతత్వం పెరగాలన్నారు. సమగ్రమైన పంట విధానాలను అవలంబించాలన్నారు. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ కూడా అవసరమన్నారు. మోడల్ చట్టాలను అమలు చేసే రాష్ట్రాలను మరింత ప్రోత్సహించినున్నట్లు మంత్రి తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న వంద జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. 
 
సోలార్ పంపులను పెట్టుకునేందుకు సుమారు 20 లక్షల రైతులకు పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఈవమ్ ఉత్తన్ మహాభియాన్ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.
 
మరోవైపు విదేశీ పెట్టుబడుల గురించి మంత్రి మాట్లాడారు. 280 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రపంచంలోనే భారతదేశం ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు. ఆయుష్మాన్ భవతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏప్రిల్ నుండి కొత్త జీఎస్టీ విధానం అమలులోకి రాబోతుందని చెప్పారు.
 
భారత్‌కు మరిన్ని పెట్టుబడులు రావాలని నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. మూడు లక్ష్యాలతో ముందుకు వెళుతున్నామని సబ్ కా సాత్, సబ్ కా వికాస్, న్యూ ఇండియా, ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో ముందుకు వెళుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments