Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో శ్రీలంక కానున్న ఆంధ్రప్రదేశ్ : హెచ్చరించిన 'ది ప్రింట్'

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంక కానుంది. ఉచితాల పేరు కోసం చేసిన అప్పులు డబ్బు రూపేణా రాష్ట్ర ప్రభుత్వం పంచిపెడుతుంది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తికి ముందే ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. అదేసమయంలో కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం అంచున ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇప్పటికే సొంత ఆదాయం బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తుంది. ఈ అప్పులపైనే రాష్ట్రం రోజువారీ బతుకును సాగిస్తుంది. ఈ పరిస్థితులో ప్రముఖ మీడియా హౌస్ "ది ప్రింట్" సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో అప్పుల కుప్పలు పెరిగిపోయి దారుణ పరిస్థితులు నెలకొనివున్నాయని బాంబు పేల్చింది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని పేర్కొంది. ఇప్పటికైనా మేల్కొనకుంటే మరో శ్రీలంక కావడం తథ్యమని హెచ్చరించింది. 
 
ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యే రాష్ట్రాల్లో పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గత 2018-19 సంవత్సరం నుంచి ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయనని ఆ మీడియా హౌస్ తన ప్రత్యేక కథనంలో పేర్కొంది. 
 
నిజానికి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత ఐదేళ్లలో రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కంటే వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదలే ఎక్కువగా ఉందని ‘కాగ్’ నివేదికలు కూడా చెబుతున్నాయి. ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాలు వాటిని తీర్చలేకపోతున్నాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments