దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి డ్యాన్స్ చూసి ఏడుస్తారెందుకు?(video)

ఐవీఆర్
బుధవారం, 11 జూన్ 2025 (15:19 IST)
లివ్ ఇన్ రిలేషన్ సాగిస్తూ సమాజంలో పూర్తిస్థాయి ఎంజాయ్ చేస్తున్న జంటల్లో దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి వున్నారని ప్రస్తుతం వైరల్ అవుతున్న వారి డ్యాన్స్ వీడియోను చూసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏమాటకామాట... దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఇలాగే డ్యాన్స్ చేస్తూ పోతే సినీ ఇండస్ట్రీలో సూపర్ డ్యాన్సులేసేవారు కూడా ఆయన ముందు ఓడిపోతారంటున్నారు. అంతెందుకు.. దువ్వాడ-దివ్వెల ఇద్దరూ అలా స్టేజి పైన డ్యాన్సు చేస్తుంటే ఎదురుగా వారి డ్యాన్స్ చూస్తున్నవారు కుర్చీల్లో కూర్చోలేకపోయారట. వారి స్టెప్పులకు ఊగిపోతూ కేరింతలు కొడుతూ ఓ దశలో స్టేజి పైకి ఎక్కి వారితో కలిసి కాళ్లు కదుపుదాము అనుకున్నారట. ఐతే నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి కుర్చీల్లోనే పిసుక్కుంటూ కూర్చున్నారట.
 
ఇక నెటిజన్ల కామెంట్లు మామూలుగా లేవు. సోషల్ మీడియా బద్ధలయిపోతోంది. ఏదేమైనా వైసిపి ఓడిపోయాక ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు జైళ్లలోనూ, ఇంకొందరు అజ్ఞాతంలోనూ, మరికొందరు రోగాలుతో సతమతం అవుతుంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం రా అంటూ దూసుకు వెళ్తున్నారని కామెంట్లు కొడుతున్నారు. ఇంకొందరైతే... హాయిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న ఆ జంటను చూసి, వాళ్ల డ్యాన్సును చూసి ఏడుస్తారెందుకు అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద దువ్వాడ-దివ్వెల డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments