Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

Advertiesment
Tiger

సెల్వి

, శుక్రవారం, 6 జూన్ 2025 (20:08 IST)
Tiger
సాధారణంగా సింహాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోతుంటాం. కానీ ఓ బైకర్ మాత్రం సింహం తన ముందు అలా నడుస్తూ వెళ్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. సింహమే కదా అంటూ తన బండిని తాను నడుపుకుంటూ వెళ్లిపోయాడు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియో  రోడ్డుకు ఇరువైపుల చెట్లతో కూడినదిగా కనిపిస్తోంది. ఈ రోడ్డుపై వెళ్తున్న బైకర్‌కు సింహం కనిపించింది. రోడ్డును దాటుకుని సింహం వెళ్తున్నా. ఆ బైకర్ దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బండిని నడుపుతూ.. బండిని పక్కకు తిప్పుకుని వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ బైకర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. 
 
ఆ బైకర్ సింహాన్ని కుక్కనుకున్నాడా ఏంటి ప్రశ్నిస్తున్నారు. ఏమి గుండెరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సింహాన్ని చూస్తే గుండె ఆగిపోయే పనవుతుంది అలాంటిది ఆ బైకర్ ఏమాత్రం భయపడకుండా సైలెంట్‌గా వెళ్తున్నాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైబర్ నేరాలకు చెక్ : ఇక ఈ నంబర్ల కాల్స్ వస్తే... అవి ఎస్‌.బి.ఐ కాల్సే...