Publish Date: Sat, 07 Jun 2025 (16:52 IST)
Updated Date: Sat, 07 Jun 2025 (16:55 IST)
Warangal municipal Employees
వరంగల్ ప్రభుత్వ కార్యాలయంలో రాసలీలలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం నిత్యం సిబ్బందితో కళకళలాడుతుంది. సమయం సాయంత్రం అయితే బోసిపోతుంది. దీనిని అదనుగా తీసుకున్న ఇద్దరు ఉద్యోగులు తమ లైంగిక కోరికలను తీర్చుకోవడం మొదలెట్టారు. తాము ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నామనే విషయాన్ని మరిచిపోయారు.
ఎవరైనా చూస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని.. తమ జీవితాలనే ఎసరు పెట్టినట్లు అవుతుందని ఆలోచించకుండా.. రాసలీలల్లో మునిగిపోయారు. లిప్‌లాక్‌లు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఇద్దరు ఉద్యోగులు ఇలా చాలా క్లోజ్‌గా వుండటాన్ని బయట వున్న వ్యక్తులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా వీడియోలు తీశారు.
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఉద్యోగులు షాక్ అయ్యారు. వారిద్దరికి పై స్థాయి అధికారులు గట్టిగానే మందలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సెల్వి
Publish Date: Sat, 07 Jun 2025 (16:52 IST)
Updated Date: Sat, 07 Jun 2025 (16:55 IST)