Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Warangal: వరంగల్ అందాలు వేయి స్థంభాలు- శిలాతోరణాలు- రానున్న అందమైన భామలు (Photos)

Advertiesment
Warrangal

సెల్వి

, సోమవారం, 5 మే 2025 (13:33 IST)
Warrangal
వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలలో ఒకటి. ఇది రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కిలో మీటర్ల దూరంలో వుంది. వరంగల్ ప్రస్తుత తెలంగాణలో రెండో అతి పెద్ద నగరం. క్రీ.శ. 12-14వ శతాబ్ధంలో ఈ రాజ్యాన్ని కాకతీయులు పరిపాలించారు. 
 
వరంగల్ అంటే గుర్తుకొచ్చేది వేయి స్ధంభాల గుడి. ఇది చాలా ప్రసిద్ధి చెందినది. కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గిరిజన తెగకు చెందిన మేడారం వంశీయులైన సమ్మక్క, సారక్కల వీరోచిత పోరాటం చిరస్మరణీయంగా మిగిలింది. ఆసియాలోనే పెద్ద గిరిజన జాతరగా ఇది ప్రసిద్ధి చెందినది. 13 వ శతాబ్ధంలో నిర్మించిన ఈ కోట వరంగల్ పట్టణానికి 2 కి.మి. దూరంలో కలదు. దీని కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా వాడుకలో ఉంది. 
webdunia
Warrangal
 
కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరం ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి దీనిని పూర్తి చేసింది. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయంగా పేరుగాంచినది.
 
ఇకపోతే.. ప్రపంచ సుందరీమణులు ఈసారి తెలంగాణలో పోటీలలో పాల్గొంటున్న నేపధ్యంలో వారికి తెలంగాణా చారిత్రక, సాంస్కృతిక వైభవం తెలిసేలా ఆయా ప్రాంతాల సందర్శనకు ఏర్పాట్లు చేసింది తెలంగాణా ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 14వ తేదీన వరంగల్ పర్యటిస్తారు. 
webdunia
Warrangal
 
ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్నసుందరీమణులు వరంగల్ సందర్శన నేపథ్యంలో కాకతీయ కళాసంపద చెంత ప్రపంచ అందాల భామల జిలుగులు చూడాలని ఓరుగల్లు వాసులు కూడా ఎదురు చూస్తున్నారు. 
webdunia
Warrangal
 
వరంగల్ కోట గురించి..
వరంగల్ కోట తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఇది కాకతీయ రాజవంశం, ముసునూరి నాయకుల రాజధాని. ఈ కోట వరంగల్, హన్మకొండ మధ్య 19 కి.మీ విస్తీర్ణంలో ఉంది. కాకతీయ రాజు గణపతి దేవుడి పాలనలో 12-13వ శతాబ్దంలో వరంగల్ కోట నిర్మాణం ప్రారంభమైంది. 
 
ఏకశిల గణపతి దేవుడు వరంగల్ రాతి కోటను నిర్మించారని నమ్ముతారు. ఈ కోట చాలాసార్లు దాడి చేయబడింది. కోట శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ, ఈ కోట పురాతన ఆలయం, గోడ, వాస్తుశిల్పం ఇప్పటికీ ప్రజలను ఆకర్షించే కేంద్రంగా ఉన్నాయి. వరంగల్ కోట దాని అందమై, చక్కగా చెక్కబడిన తోరణాలు, స్తంభాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?