Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Advertiesment
amaravati

ఐవీఆర్

, శనివారం, 7 జూన్ 2025 (16:49 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారనీ, ఐతే ఇది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తనకున్న సమాచారం ప్రకారం అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేశ్యలు వుంటారనీ, వారికి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాలతో పాటు శిబిరాలు కూడా వున్నయంటూ ఆరోపణలు చేసారు. కృష్ణం రాజు వ్యాఖ్యలతో అమరావతి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
వెంటనే తమకు క్షమాపణలు చెప్పకపోతే నీ అరెస్ట్ ఖాయం అంటూ హెచ్చరించారు. ఇంత దారుణమైన మాటలు అంటుంటే పత్రికా ఛానల్ అధిపతి భారతీ రెడ్డిగారు చూస్తూ ఎలా కూర్చున్నారో తమకు అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తమకు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే సాక్షి ఛానల్ ఎక్కడుంటే అక్కడ చుట్టుముడతామని అమరావతి మహిళా సంఘం హెచ్చరించింది. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణం రాజును వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?