Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరజ్ పేరుంటే పెట్రోల్ ఫ్రీ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (13:55 IST)
ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణపతకం సాధించిన పెట్టిన హీరో నీరజ్ చోప్రా. దేశానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్‌కు ఇపుడు దేశంలో వీరాభిమానులు ఎక్కువైపోయారు. దీంతో ఆయన పేరుమీద దానధర్మాలు చేస్తున్నారు. తాజాగా నీరజ్ అనే పేరున్న వారికి ఉచితంగా పెట్రోల్ పోస్తున్నారు. 
 
నీరజ్ బంగారం పతకం సాధించిన శుభసందర్భంగా నీరజ్ పేరున్న ప్రతి ఒక్కరికీ పెట్రోల్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ఓ బంక్ యజమాని ముందుకొచ్చాడు. నీరజ్ చోప్రా మీద అభిమానంతో ఆ బంక్ యజమాని ఇలా చేస్తున్నాడు.. గుజరాత్‌లోని బారుచ్ జిల్లా నేత్రంగ్ టౌన్‌లోని ఇండియన్ ఆయిల్ బంక్ యజమాని ఈ ఆఫర్ ప్రకటించాడు.  
 
వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత ఆటగాడు నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. నీరజ్ చోప్రా మాత్రమే కాదు.. నీరజ్ పేరు ఉన్న వారందరూ ఆ సంతోషాన్ని అనుభవించాలని సదరు బంక్ యజమాని ప్లాన్ చేశాడు. 501 రూపాయల విలువైన పెట్రోల్‌ను నీరజ్ పేరు కలిగిన వారందరికీ ఉచితంగా ఇస్తానని బోర్డు పెట్టాడు.
 
అదివారం ఉదయం నుంచి ఈ రోజు (సోమవారం) సాయంత్రం 5 గంటల వరకు నీరజ్ పేరు కలిగిన బారుచ్ జిల్లా వాసులందరికీ ఆ ఆఫర్ వరిస్తుందని పేర్కొన్నాడు. ఏదైనా అధికారిక ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లి తమ పేరు నీరజ్ అని నిరూపించుకుంటే చాలు వారికి 501 రూపాయల విలువైన పెట్రోల్‌ ఫ్రీ. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీరజ్ పేరున్న వ్యక్తులందరూ ఆ పెట్రోల్ బంక్ ముందు క్యూ కడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments