జీహెచ్ఎంసీ కార్మికుడు అంతయ్య మృతదేహం లభ్యం

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (13:35 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల మ్యాన్‌హోల్‌లో గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని అపుడే వెలికి తీశారు. గల్లంతైన మరో మృతదేహం కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలించాయి. ఈ గాలింపు చర్యల ఫలితంగా కార్మికుడు అంతయ్య గల్లంతైన ఆరు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. 
 
ఆరు రోజుల తర్వాత ఆయ‌న మృత‌దేహం బయటపడింది. మ్యాన్‌హోల్‌లో గల్లంతైన ప్రాంతం నుంచి 350 మీటర్ల దూరంలో అంతయ్య మృతదేహం ల‌భ్య‌మైన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆరు రోజులుగా కొన‌సాగిస్తోన్న‌ రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఆరు రోజుల పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం నాలాను తవ్వుతూ ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొంది.
 
కాగా, ఇటీవ‌ల రాత్రి స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మురికి కాలువలోకి దిగాల‌ని కాంట్రాక్టర్ చెప్ప‌డంతో మొద‌ట శివ మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. అతను అందులోనే చిక్కుకుపోవడంతో కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా చిక్కుకుపోయాడు. ఇద్ద‌రూ మృతి చెందారు. దీంతో కాంట్రాక్టర్ స్వామిపై పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments