ఒకే ఒక్క‌డు, మారువేషంలో విజయవాడ సబ్‌కలెక్టర్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (20:39 IST)
ఒకే ఒక్క‌డు... సినిమాలో ఒక్క రోజు సీఎంగా అర్జున్ మారువేషంలో ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతాడు... అవినీతిని చెండాడుతాడు... అలాగే మారువేషంలో పోలీస్ ఆఫీస‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్ కూడా చాలా సినిమాల్లో చేశాడు. ఇవ‌న్నీ సినిమాల‌కే ప‌రిమితం... కానీ, నిజ‌జీవితంలోనూ మారువేషంలో తిరిగిన ఓ ఐ.ఎ.ఎస్. అధికారి ఉన్నాడా అంటే... ఇదిగో ఆయ‌నే విజయవాడ సబ్ కలెక్టర్! సూర్యసాయి ప్రవీణ్ చంద్.
 
ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి మారు వేషంలో వెళ్లి అడిగారు విజ‌య‌వాడ స‌బ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు షాపు యజమాని. ఇలా సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లిన సబ్ కలెక్టర్ కు గ్రౌండ్ రియాలిటీ తెలిసివ‌చ్చింది. ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు యజమాని.

అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు సబ్ కలెక్టర్. అక్క‌డ సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి, ఎమ్మార్పీ ధర కన్నా అధికంగా వసూళ్లు చేసాడు సదరు షాపు యజమాని. బిల్లు ఇవ్వ‌మంటే, వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు ఆ షాపు యజమాని. ఆ తర్వాత ఒకొక్క అధికారికి ఫోన్ చేసి, ఆ ఎరువుల షాపున‌కు పిలిపించారు... సబ్ కలెక్టర్.

త‌మ ఉన్న‌తాధికారి ఈ వేషంలో వ‌స్తార‌ని ఊహించ‌ని అధికారులు త‌డ‌బ‌డ్డారు. ఆ రెండు షాపులను వారితోనే సీజ్ చేయించారు సబ్ కలెక్టర్. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్కు ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉంది.

అక్కడి రైతులను వాకబు చేసిన సబ్ కలెక్టర్‌కు ఇక్క‌డ కూడా ఎమ్మార్పీ ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని రైతులు తెలిపారు. షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా చూస్తుంటే... ఓ సినిమా స్టోరీలా ఉంది క‌దా... లేదండి ఇది విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్...రియాలిటీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments