బ్ర‌హ్మంగారి మ‌ఠం స‌మీపంలో రోడ్డు ప్ర‌మాదం... న‌లుగురు మృతి!

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (20:35 IST)
కడప జిల్లా బద్వేలు, మైదుకూరు జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందారు.
 
బ్రహ్మంగారి మఠం డి.అగ్రహారం సమీపంలో టమోటా లోడు లారీ వేగంగా, మారుతి ఎర్టిగా కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్నఎనిమిది మందిలో నలుగురు మృతి చెందగా, ముగ్గరి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం మొగల్కోట్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ఈ ప్రమాదంలో సంవత్సరంలోపు చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. వీరంతా నెల్లూరు పట్టణంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు మృత దేహాల్లో ఓ మహిళ ఇద్దరు పురుషులు కాగా ఓ చిన్నారి కూడా ఉన్నారు. అర్ధ రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ శబ్దానికి గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామస్థుల సహాయంతో కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ఆస్పత్రిలో ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments