Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Advertiesment
Five
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై లారీ, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా సంగాయిపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40) దంపతుల కుమారుడు వివేక్‌(6) అనారోగ్యానికి గురి కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా.. జిల్లాలోని చౌటకూర్‌ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పుల్కల్‌ ఎస్సై నాగలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మఅతదేహాలను శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ రమణ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప్పొంగిన వాగులు.. అంబులెన్స్‌లోనే గర్భిణీకి పురుడు పోశారు.. ఎక్కడ?