Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గద్వాలలో సూదిని మింగిన పరశురాముడు

Advertiesment
Telangana
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా అనంతపురం గ్రామంలో పరశురాముడు అనే యువ‌కుడు సూదిని మింగాడు. పశువులకు ఇంజెక్షన్లు వేసేందుకు వినియోగించే సూదిని నోట్లో పెట్టుకునివుండగా, అది కాస్త పొరపాటున ఒక్కసారిగా గొంతులోకి చేరి ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది. 
 
దీంతో ఆ యువకుడు గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, విపరీతమైన దగ్గుతో బాధ‌ప‌డ్డాడు. అయితే అతడి పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంట‌నే అత‌డిని కర్నూలులోని సత్యసాయి ఈఎన్‌టీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 
 
వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు అత్యాధునిక టెలిస్కోపిక్‌ బ్రాంకోస్కోప్‌ ద్వారా ఆ సూదిని బయటకు తీశారు. ఎంతో క్లిష్టమైన ప‌ద్ధ‌తి ద్వారా ఆ సూదిని తొల‌గించామ‌ని వైద్యులు చెప్పడంతో పరశురాముడు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పు తీర్చమన్న మహిళ.. కాలితో తన్నిన ఆటో డ్రైవర్