అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు జో బైడెన్‌దే... ట్రంప్ ఇంటికెళ్లాల్సిందే...

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (14:51 IST)
గత యేడాది నవంబరు నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయభేరీ మోగించినట్టు అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. విజయానికి కావాల్సిన 270 వోట్లను బైడెన్ సాధించినట్టు కాంగ్రెస్ పేర్కొంది. క్యాపిటల్‌ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడితో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆధ్వర్యంలో రెండు సభలు సంయుక్తంగా సమావేశమై బైడెన్ విజయాన్ని ధృవీకరించాయి. 
 
దీనికి కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం బెడెన్‌దే విజయమంటూ ప్రకటించింది. జనవరి 20న జో బెడెన్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణశ్వీకారం చేయనున్నారు. అధికార పీఠం వదిలిలేది లేదంటూ కల్లోలానికి కారణం అవుతున్న ట్రంప్‌కు ఈ పరిణామంతో భారీ షాక్ తగిలినట్టైంది. బైడెన్ వైట్ హౌస్‌కీ.. ట్రంప్ సొంత హౌస్‌కు వెళ్లడం ఖాయమైపోయింది.
 
కాగా, అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ బిల్డింగ్‌పై డోనాల్డ్ ట్రంప్ మద్దతు దారులు దాడి చేయడంతో ఆసమయంలో అమెరికా చట్టసభల్లో ఉన్న సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. అమెరికా ఎగువ, దిగు సభల సమావేశాన్ని తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే.. పరిస్థితి అదుపులోకి వచ్చాక అమెరికా చట్టసభ సభ్యులు మరోసారి సమావేశమై బెడెన్ విజయాన్ని ధృవీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments