Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అడుగడుగునా ఆటంకాలు.. బైడెన్ ఎన్నికను అడ్డుకోవడమే వ్యూహం...

Advertiesment
అడుగడుగునా ఆటంకాలు.. బైడెన్ ఎన్నికను అడ్డుకోవడమే వ్యూహం...
, గురువారం, 7 జనవరి 2021 (10:56 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇపుడు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. తన ఓటమిని జీర్ణించుకోలేని ఆయన తొలుత న్యాయపోరాటం చేశారు. ఇందులో ఆయనకు చుక్కెదురైంది. ఈ క్రమంలో తన మద్దతుదారులను రెచ్చగొట్టారు. అంతే... తమ అభిమాన నేత పిలుపుతో రెచ్చిపోయిన వారు.. ఇపుడు అమెరికాలో రణరంగం సృష్టిస్తున్నారు. 
 
నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ 306-232 ఓట్ల తేడాతో ఓడిపోయారు. డెమోక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ గెలిచారు. ఈయన్ను ఎలక్టోరల్‌ కాలేజీ ఓటర్లు గురువారం (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం) లాంఛనంగా ఎన్నుకోవలసి ఉంది. 
 
ఇందుకోసం అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలు.. ప్రతినిధుల సభ, సెనేట్‌ సంయుక్తంగా సమావేశం కానున్నాయి. ఈ ఎన్నికను అడ్డుకోవాలని ట్రంప్‌ ఇచ్చిన పిలుపు మేరకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మద్దతుదారులు రాజధాని వాషింగ్టన్‌కు తరలివచ్చారు.
 
వైట్‌హౌ్‌సకు కూతవేటు దూరంలోని ఫ్రీడమ్‌ ప్లాజాలో బైఠాయించారు. గడ్డకట్టే చలిలో.. నిరంతరం వర్షం కురుస్తున్నా అక్కడి నుంచి కదలడం లేదు. ఓటింగ్‌, లెక్కింపులో అక్రమాలు జరిగాయని.. అక్కడ ఎన్నిక రద్దుచేసి మళ్లీ జరిపించాలంటూ ట్రంప్‌ బృందం కోర్టులకు వెళ్లినా చుక్కెదురైంది. 
 
న్యాయపరమైన దారులు మూసుకుపోవడంతో.. ఇక ఆయనకు మిగిలిన ప్రత్యామ్నాయమేమిటో మద్దతుదారులకు కూడా అంతుపట్టడం లేదు. అయినా ఆయనకే మద్దతిస్తున్నారు. ట్రంప్‌ వ్యవహార శైలిపై సొంత రిపబ్లికన్‌ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
'అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, మోసం జరిగాయని రాష్ట్రాలకు తెలుసు. తమ ఓట్లను సరిదిద్దాలని అవి భావిస్తున్నాయి. పెన్స్‌ చేయాల్సిందలా.. ఆ ఓట్లను వెనక్కి పంపడమే. అలా చేస్తే మనదే విజయం. మైక్‌.. ఈ పని నువ్వు చేయాలి. అత్యంత తెగువ చూపాల్సిన సమయమిది' అంటూ ట్వీట్ చేశారు. 
 
తాను చెప్పినట్లు చేయకపోతే పెన్స్‌ రాజకీయంగా దెబ్బతింటారంటూ ట్రంప్‌ ఒత్తిడి తెస్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. అధ్యక్షుడి సూచనను పెన్స్‌ తిరస్కరించారని పేర్కొంది. కాగా, తాజాగా జరిగిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృతిచెందాడు. 
 
కాగా అలీపే, వుయ్‌చాట్‌ పే సహా ఇంకో 8 చైనీస్‌ యాప్‌లపై అమెరికా నిషేధం విధించింది. అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు వాటి లావాదేవీలను నిలువరించే కార్యనిర్వాహక ఆదేశాలపై అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24 గంటల్లో కరోనాతో ఎంత మంది మృతి చెందరో తెలుసా?