శబరిమలలో భక్తుల సెంటిమెంటే గెలిచింది.. ఎలాగంటే?

కేరళలోని సుప్రసిద్ధ ఆలయం శబరిమలలో.. సెంటిమెంట్ గెలిచింది. పది నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను పోలీసులు పాటించలేకపోయారు. వంద మంద

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (12:46 IST)
కేరళలోని సుప్రసిద్ధ ఆలయం శబరిమలలో.. సెంటిమెంట్ గెలిచింది. పది నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను పోలీసులు పాటించలేకపోయారు. వంద మంది పోలీసులు నిలబడినా.. భారీ స్థాయిలో భక్తులు నిలవడంతో, స్వామి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు మహిళలు వెనుదిరగక తప్పలేదు.
 
అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని హైదరాబాద్ మోజో టీవీ జర్నలిస్టు కవిత, ఎర్నాకులంకు చెందిన రేహ్నా ఫాతిమాలు పోలీసుల సాయంతో ఆలయం వరకూ మాత్రమే చేరుకోగలిగారు. అయితే అక్కడున్న భక్తులు వారిని సముద్రంలా అడ్డుపడ్డారు. దీంతో వారిని పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లిన ఐజీ శ్రీజిత్, వారికి పరిస్థితిని చెప్పి, వెనుదిరగాలని కోరడంతో అందుకు వారు అంగీకరించారు. 
 
ఇదే విషయాన్ని మీడియాకు వివరించిన శ్రీజిత్, మహిళా భక్తులు వెనుదిరిగేలా ఒప్పించామని, పోలీసుల భద్రత నడుమే వారు కొండ దిగుతున్నారని చెప్పారు. దీంతో అయ్యప్ప భక్తుల సెంటిమెంట్ గెలిచిందని నెట్టింట చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments