Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటన్ పార్లమెంట్‌ దిగువ సభలోనూ ''మీ టూ''- ''A'' జోకులు.. బలవంతంగా ముద్దు..?

''మీ టూ'' ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భావించే బ్రిటన్ పార్లమెంటులో కూడా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తేలింది.

Advertiesment
బ్రిటన్ పార్లమెంట్‌ దిగువ సభలోనూ ''మీ టూ''- ''A'' జోకులు.. బలవంతంగా ముద్దు..?
, బుధవారం, 17 అక్టోబరు 2018 (11:29 IST)
''మీ టూ'' ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా భావించే బ్రిటన్ పార్లమెంటులో కూడా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తేలింది. పలు రంగాల్లో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మహిళలు బట్టబయలు చేస్తున్న నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్(దిగువ సభ)లో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నేత ఆండ్రియా లీడ్సమ్ విచారణకు ఆదేశించారు. 
 
ఇందులో భాగంగా మాజీ జడ్జీ డేమ్ లారా కాక్స్ జరిపిన విచారణలో సంచలనాత్మక విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 200 మంది మహిళా ఉద్యోగులపై ప్రస్తుత, మాజీ ఎంపీలు వేధింపులకు పాల్పడ్డారని వెల్లడి అయ్యింది. లైంగిక వేధింపులకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం, శరీర రూపు రేఖలపై కామెంట్లు చేయడం, బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడం, సెక్సు జోకులు వేయడం, అభ్యంతరకరంగా తాకడం, విసిగించడం వంటి ఆరోపణలు వచ్చాయి. 
 
మహిళా ఉద్యోగుల ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలను తేల్చే యంత్రాంగం బ్రిటన్ పార్లమెంటులో కరువయిందని తెలిపారు. నిబంధనల మేరకు లైంగిక వేధింపులకు పాల్పడ్డ చట్టసభ్యుల పేర్లను బయటపెట్టలేక పోతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 155 పేజీల నివేదికను లారా సభకు సమర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమలలో హై టెన్షన్.. మహిళలు ప్రవేశిస్తే శుద్ధి చేయలేం..