Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో బీభత్సం... తల నరికి పోలీసు స్టేషనుకు పట్టుకెళ్లాడు... కర్నాటకలో ఏం జరుగుతోంది?

కర్నాటక రాష్ట్రంలో తలను నరికి పోలీసు స్టేషన్లకు వెళుతున్న హంతకుల సంఖ్య ఒకే నెలలో ముగ్గురికి చేరింది. రెండు రోజుల క్రితమే ఓ ఉన్మాది తన భార్యను అత్యంత దారుణంగా నరికి చంపి ఆమె తలను పట్టుకుని పోలీసు స్టేషనుకు వెళ్లాడు.

మరో బీభత్సం... తల నరికి పోలీసు స్టేషనుకు పట్టుకెళ్లాడు... కర్నాటకలో ఏం జరుగుతోంది?
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (17:31 IST)
కర్నాటక రాష్ట్రంలో తలను నరికి పోలీసు స్టేషన్లకు వెళుతున్న హంతకుల సంఖ్య ఒకే నెలలో ముగ్గురికి చేరింది. రెండు రోజుల క్రితమే ఓ ఉన్మాది తన భార్యను అత్యంత దారుణంగా నరికి చంపి ఆమె తలను పట్టుకుని పోలీసు స్టేషనుకు వెళ్లాడు. అతడు ఆమె తలను బ్యాగులో నుంచి బయటకు తీయగానే పోలీసులంతా జడుసుకున్నారు. అతడు మాత్రం ఉన్మాదిలా తలను బయటకు తీసి ఏదో మాట్లాడుతూ కూర్చుండిపోయాడు. 
 
ఈ దారుణ ఘటన మరువక ముందే మరోసారి మాన్డియా జిల్లా పరిధిలోని మల్లవల్లి గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే... గిరీష్‌ అనే వ్యక్తి ఒక మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహం చెందిన బాధితురాలి కుమారుడు పశుపతి గిరీష్‌‌తో గొడవపడ్డాడు. ఆ తర్వాత గొడ్డలి తీసుకుని అతడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. 
 
ఆ తర్వాత మృతుడి శరీరం నుంచి తలను వేరు చేసి స్థానికంగా ఉన్న పోలీస్టేషన్‌కి తీసుకెళ్లి అక్కడ లొంగిపోయాడు. ఖండించిన తలను పట్టుకుని హంతకుడు రోడ్డుపై తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నెల రోజుల వ్యవధిలో కర్ణాటక రాష్ట్రంలో మూడోసారి ఒకే తరహాలో హత్యా ఘటనలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవంత్ రెడ్డి స్వాతిముత్యంలో కమల్ కాదు.. విశ్వరూపంలో కమల్ హాసన్- బాల్క సుమన్