బైడెన్‌‌కు ట్రంప్ లేఖ... అందులో ఏముందో తెలుసా?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:45 IST)
చివరి వరకు జో బైడెన్‌ విజయాన్ని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్.. కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని మాత్రం కొనసాగించారు. శ్వేతసౌధాన్ని వీడుతూ ఓవల్ కార్యాలయంలో ఓ లేఖను విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ వైట్ హౌస్ వద్ద మీడియాతో తెలిపారు.

కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం సంతోషం అని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడికి విషెస్ చెబుతూ.. ప్రెసిడెంట్‌కు మద్దతుగా ఉంటానని, ఆయన పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నట్లు లేఖలో ట్రంప్ పేర్కొన్నారని సమాచారం. 
 
బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ట్రంప్ హాజరుకాని విషయం తెలిసిందే. ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్‌ పెన్స్‌ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్లిపోయారు. అధ్యక్ష హోదాలోనే ట్రంప్ నిష్క్రమణ జరగడం గమనార్హం. ఇక పటిష్టమైన భద్రతా నడుమ 78 ఏళ్ల జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 25వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ పహారాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 

నరేంద్ర మోదీ అభినందనలు
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్‌-అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నానని ఆయన ట్వీట్‌ చేశారు.

‘‘నమ్మకం ఆధారంగా భారత్‌-అమెరికా భాగస్వామ్యం కొనసాగుతోంది. మన ద్వైపాక్షిక బంధం ఎంతో దృఢమైనది. అమెరికాను నడిపించడంలో మీరు (బైడెన్‌) విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అని మోదీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments