నూతనాధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతంకం చేశారు. కరోనా వైరస్, ఇమ్మిగ్రేష్, వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన 17 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు.
డెమొక్రాట్లు మరింత విస్తృతమైన, సత్వర శాసన సభ చర్యల నిమ్తితం ముందుకు రావడంతో గతంలో ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను రద్దు చేస్తూ.. 10 రోజుల పాటు కార్యాచరణ ప్రణాళికలపై దృష్టి సారించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్‌పై యుద్ధానికి ప్రాముఖ్యత కనబర్చారు.
కరోనా కట్టడి చేసేందుకు మాస్క్‌లు అవసరమన్న బైడెన్ కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు. 100 రోజుల పాటు తప్పని సరిగా మాస్క్‌లు వినియోగించాలని ప్రజలను కోరారు. మహమ్మారి స్థితిగతులపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి సమాచారం అందించేలా 'కొవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్' పోస్టును సఅష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అమెరికా వైదొలగుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేశారు. సీనియర్ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌసీ నేతఅత్వంలోని బఅందం డబ్ల్యూహెచ్‌వో సమావేశాలకు ఇకపై ప్రాతినిధ్యం వహించనుంది. ట్రంప్ హయాంలో వైదొలిగిన పారిస్ ఒప్పందాన్ని బైడెన్ తిరిగి పునరుద్ధరించారు.
అమెరికాను ఈ ఒడంబడికలో ఒప్పందం చేస్తూ సంతకాలు చేశారు. దీంతో కాలుష్య నియంత్రణకు చర్యలతో పాటు ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఆమోదం లభించినట్లయింది.
ముస్లిం దేశాలకు రాకపోకలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని బైడెన్ ఎత్తివేశారు. మెక్సికో గోడ నిర్మాణం నిమిత్తం నిధుల సమీకరణకు ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ డిక్లరేషన్ నిలిపేశారు. గ్రీన్ కార్డుల జారీపై దేశాలవారీ పరిమితిని నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఉపసంహరించారు.
జాతి వివక్ష నిర్మూలన దిశగా... బ్లాక్, లాటినో, నేటివ్, ఏషియన్, పసిఫిక్ ద్వీపాల, ఎల్‌జీబీటీక్యూ, మతపరమైన మైనార్టీ వ్యక్తులకు సమాన హక్కులను నిర్వచిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా బైడెన్ సంతకం చేశారు.
బాల్యంలోనే అమెరికాకు వలస వచ్చి.. దేశాభివఅద్ధిలో భాగస్వామ్యమైన వారికి శాశ్వత నివాసం/పౌరసత్వం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు.