Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైడెన్‌ కు కరోనా టీకా రెండో డోసు

Advertiesment
బైడెన్‌ కు కరోనా టీకా రెండో డోసు
, మంగళవారం, 12 జనవరి 2021 (11:24 IST)
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమోక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 21న బైడెన్‌ ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో  ఫైజర్ వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలను పోగొట్టేందుకే బహిరంగంగా టీకా తీసుకున్నట్లు బైడెన్‌ ప్రకటించారు.

కరోనా వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్‌ రెండు డోసులు తప్పనిసరి. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. రెండో సారి టీకా తీసుకుంటున్న సందర్భంలో కాస్త ఒత్తిడికి గురయ్యానని అన్నారు.

అమెరికా ప్రజలందరికీ కరోనా టీకా అందించడమే తన ప్రథమ కర్తవ్యమని బైడెన్‌ పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు అమెరికాలో 2,23,85,975 మంది కరోనా బారిన పడగా, 3,74,072 మంది మరణించారు.

అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండడం, కొత్తరకం స్ట్రెయిన్‌ కరోనాతో అమెరికాలో తీవ్ర అలజడి నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుర్గమ్మను దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్