బిడ్డ పుట్టింది, కానీ రాయిలా మారుతోంది, తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

Webdunia
శనివారం, 3 జులై 2021 (18:53 IST)
కన్నబిడ్డను కళ్లారా చూడగానే తల్లిదండ్రులు పొంగిపోతారు. ఈ ఏడాది జనవరి 31న పుట్టిన చిన్నారిని చూడగానే ఆ తల్లిదండ్రులు కూడా సంబరాలు చేసుకున్నారు. కానీ 5 నెలలు గడిచాక పాపలో ఏదో తేడా వస్తున్నట్లు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పాపకు అరుదైన వ్యాధి సోకిందనీ, ఈ కారణంగా ఆమె క్రమంగా రాయిలా మారుతుందని షాకింగ్ వార్త చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
 
వివరాల్లోకి వెళితే... యూకెలోని హేమెల్ హెంప్‌స్టెడ్ ప్రాంతంలో అలెక్స్, దవే దంపతులు వుంటున్నారు. వీరికి గత జనవరిలో పాప పుట్టింది. ఈ బేబీకి 5 నెలల తర్వాత కాలిబొటనవేళ్లు రెండు అతుక్కున్నట్లు అగుపించాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా పాపకు ఎఫ్ఓపి అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిపారు వైద్యులు.
 
ఈ జబ్బు 20 లక్షల మందిలో ఒకరికి వస్తుందన్నారు. ఈ జబ్బు కారణంగా శరీరంలో ఎముకలు పెరుగుతూ పోతుంటాయి. ఫలితంగా కొన్నాళ్లకి పాప కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. వీరి జీవితకాలం 40 ఏళ్లకు మించదు. 20 ఏళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వుంటుంది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు అధైర్యపడలేదు. తమ చిన్నారికి చికిత్స చేయించి ఎలాగైనా మామూలు స్థితిలో వుంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments