బెజవాడ పోలీసుల అదుపులో బంగ్లాదేశ్ యువకులు

Webdunia
శనివారం, 3 జులై 2021 (17:59 IST)
అక్ర‌మంగా మ‌న దేశంలో చొర‌బ‌డిన న‌లుగురు బంగ్లాదేశీయుల‌ను బెజ‌వాడ పోలీసులు ప‌ట్టుకున్నారు. విజ‌య‌వాడ‌లో ఆ నలుగురు యువకులను‌ విచారిస్తున్నారు. తుల్లానా జిల్లా నుండి భారత్ లోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులైన వీరు అస‌లు ఎందుకు వ‌చ్చారో ఆరా తీస్తున్నారు. హౌరా- వాస్కోడిగామా రైలులో వీరు వెళ్తుండగా బెజవాడలో రైల్వే పోలీసులు వారిని నిలువ‌రించారు. పాస్‌పోర్ట్ లేకుండానే వీరు ర‌హ‌స్యంగా నల్లాల ద్వారా భారత్ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. వీరు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నలుగురు యువ‌కులుతో పాటు మ‌రికొంద‌రు బంగ్లాదేశీయులు ఉపాధి కోసం భారత్ లోకి అక్రమంగా వచ్చినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్ల డ‌యింది.

వీరు పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసాలు ఏర్పాటు చేస్తుకునట్టు గుర్తించారు. 
నిందితుల నుండి నకిలీ పాన్, ఆధార్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడ‌తామ‌ని పోలీసులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments