Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రంగంలోకి హైదరాబాద్ మెట్రో

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (13:17 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో నగర ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగ వేళ ఊళ్లకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకుని మెట్రో వేళలను సవరించారు. శనివారం నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. 
 
తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ అన్ని యూనియన్లు కలసికట్టుగా సమ్మెకు దిగాయి. మరోవైపు, ప్రజల సౌకర్యార్థం కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని బస్సులను నడిపే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. ఈ బస్సులను పోలీసుల బందోబస్తుతో నడుపుతోంది. 
 
ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వికారాబాద్ డిపోకు చెందిన బస్సు పరిగి నుంచి వికారాబాద్‌కు వస్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు... బస్సుపై రాళ్లు రువ్వారు. 
 
ఈ ఘటనలో బస్సు ముందు వైపు అద్దం పగిలింది. ప్రయాణికులకు ఎలాంటి అపాయం కలగలేదు. బస్సుతో పాటు పోలీసు ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ... మెరుపు వేగంతో దాడికి పాల్పడి వెళ్లిపోయారు. ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments