Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యకు అలా సాయపడమని కోరిన భర్త, ఇంటికొచ్చినవాడితో ఆ బంధం పెట్టుకుంది

భార్యకు అలా సాయపడమని కోరిన భర్త, ఇంటికొచ్చినవాడితో ఆ బంధం పెట్టుకుంది
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (19:19 IST)
అక్రమ సంబంధాలు నిండు జీవితాలను బలి తీసుకుంటోంది. వావివరసలు మర్చిపోయి కొంతమంది శారీరక సుఖం కోసం పాకులాడుతున్నారు. అలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కొడుకు వయసున్న మేనల్లుడితో ఒక అత్త అక్రమ సంబంధం పెట్టుకుంది. రెండేళ్ళ పాటు భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది.
 
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో నివాసముంటున్నాడు ప్రసాద్. అతని భార్య వనజ. ప్రసాద్‌తో పాటు అతని తమ్ముడు శ్రీనివాస్ కూడా ఉండేవాడు. ప్రసాద్..వనజలకు ముగ్గురు పిల్లలు. మొదటి బాబు పదవ తరగతి, రెండవ పాప 8వ తరగతి, మూడవ పాప 6వ తరగతి చదువుతున్నారు. ప్రసాద్ సొంతంగా ఎలక్ట్రికల్ షాప్ నడుపుతూ ఉండేవాడు. ఆదాయం బాగానే వచ్చేది. దీంతో ఎలాంటి సమస్య లేకుండా కుటుంబం నడుస్తూ ఉండేది. 
 
అయితే పిల్లలను స్కూళ్ళకు పంపించిన తరువాత వనజ ఇంట్లో ఒంటరిగా ఉండేది. దీంతో ఇంట్లో ఉండడం బోర్ కొట్టి ఎస్.ఐ. పరీక్షలకు ప్రిపేర్ అవుతానని చెప్పింది. భర్త ప్రసాద్‌ను ఒప్పించింది. తన బంధువు వనజకు మేనల్లుడు వరుసయ్యే రాజేష్ సహకారం తీసుకోమని ప్రసాద్ చెప్పాడు. ప్రసాద్ స్వయంగా రాజేష్‌ను ఇంటికి పిలిపించి ఆమెకు క్లాస్ ఇప్పించేవాడు.
 
అయితే రాజేష్‌కు వనజ బాగా దగ్గరయ్యింది. ఆమె అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. రాజేష్ తన బంధువే కావడంతో ప్రసాద్‌కు ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో వీరి మధ్య అక్రమ సంబంధం రెండేళ్ళ పాటు సాగింది. అయితే గత వారంరోజుల క్రితం వనజ రాజేష్‌తో చనువుగా ఉన్న ఫోటోలను ఆమె సెల్ ఫోన్లో చూశాడు ప్రసాద్. షాకయ్యాడు. భార్యను మందలించాడు. ఆమెకు బుద్ధి చెప్పాడు.
 
మరొక సారి ఇలాంటివి చేయొద్దని.. మనకు పిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చాడు. భర్త మాటలకు సరేనని కన్నీళ్ళతో సారీ చెప్పింది వనజ. తన బాగోతం బయటపడిపోయిందని లోలోన రగిలిపోయిన వనజ, నిద్రిస్తున్న ప్రసాద్ తలపై బండరాయి వేసి కొట్టి చంపేసింది. ఆ తరువాత రాజేష్ సహాయంతో మృతదేహాన్ని నాంపల్లి-ఖైరతాబాద్ మధ్య రైల్వే గేట్ వద్ద పడేసింది. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తరువాత పోస్టుమార్టంలో అసలు బాగోతం బయటపడింది. వనజను పోలీసులు విచారిస్తే నిజం మొత్తం ఒప్పుకుంది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ కలకలం