Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్కజ్ భవనం శుద్ధి.... 617 మందిలో కరోనా లక్షణాలు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:22 IST)
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న ముస్లిం మతపెద్దలను ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు. ఈ భవనం నుంచి మొత్తం 2361 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 617 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. 
 
ఈ మర్కజ్ మసీదు వేదికగా ఇటీవల మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఇక్కడు కరోనా బాధిత దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సుకు హాజరై తమతమ ప్రాంతాలకు తిరిగివెళ్లిన వారి నుంచే ఈ వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ మర్కజ్ మసీదును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
పైగా, ఇక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించి వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఈ తరలింపు కార్యక్రమం ఏకంగా 36 గంటల పాటు సాగింది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరికీ మనీష్‌ సిపోడియా కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇకపోతే, ఢిల్లీలోని మర్కజ్‌ భవన్‌తో పాటు పరిసర ప్రాంతాలను సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది శానిటైజేషన్‌ చేస్తున్నారు. మర్కజ్‌ భవన్‌లో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరిగిన మత ప్రార్థనల్లో ఇతర దేశాలకు చెందిన వారితో పాటు మన దేశానికి చెందిన పలువురు ముస్లింలు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో సుమారు 3 వేల మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో పెక్కు మందికి ఈ వైరస్ సోకింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments