Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌ముద్రంలో దిగిన వ్యోమ‌గాములు.. చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (09:24 IST)
అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా రికార్డులకెక్కిన 'స్పేస్​ ఎక్స్​' క్రూ డ్రాగన్​ వ్యోమనౌక సోమవారం సురక్షితంగా భూమిపై అడుగుపెట్టింది. అంతరిక్షం నుంచి వ్యోమగాములను భూమిపైకి తీసుకువస్తున్న తొలి ప్రైవేటు సంస్థగా స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించనుంది. మే 30న ఈ రాకెట్​ ప్రయోగం జరుగగా, వీరిద్దరూ సోమవారం సురక్షితంగా భూమిపై తిరిగి అడుగుపెట్టారు. 
 
అమెరికాలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఈ వ్యోమనౌక భూమిపై అడుగుపెట్టింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తుది పరీక్షలన్నీ పూర్తి చేసుకుని శనివారం రాత్రి ఇది భూమికి బయలుదేరింది. అయితే, ఇసైస్‌ హరికేన్‌ ప్రభావం ఉన్నా వ్యోమనౌక భూమిపై దిగేందుకు అనుకూల వాతావరణమే ఉందని ఉత్తర అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. 
 
అయితే, నాసాకు చెందిన ఈ ఇద్ద‌రు వ్యోమగాములు.. గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో సుర‌క్షితంగా దిగారు. క్రూడ్రాగ‌న్ ద్వారా వ్యోమ‌గాములు.. అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగివచ్చారు. తొలిసారి ప్రైవేటు సంస్థ స్పేస్ఎక్స్ ఆ క్రూడ్రాగ‌న్ క్యాప్సూల్‌ను నిర్మించింది. వ్యోమ‌గాములు రాబ‌ర్ట్ బెన్‌కెన్‌, డ‌గ్ల‌స్ హ‌ర్లేలు.. ప్యారాచూట్ల స‌హాయంతో ఫ్లోరిడా తీరంలోని గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దిగారు. 
 
45 ఏళ్ల త‌ర్వాత అమెరికా వ్యోమ‌గాములు స‌ముద్రంలో దిగడం ఇదే తొలిసారి. 1975, జూలై 24వ తేదీన హ‌వాయి తీరంలో థామ‌స్ స్టాఫ‌ర్డ్‌, వాన్స్ బ్రాండ్‌, డోనాల్డ్ స్లేట‌న్ వ్యోమ‌గాములు స‌ముద్రంలో దిగారు. అపొలో-సొయోజ్ ప్రాజెక్టులో భాగంగా వాళ్లు ఆ యాత్ర చేప‌ట్టారు.
 
స్పేస్ఎక్స్‌కు చెందిన రాకెట్ మే 30వ తేదీన ఎగిరింది. క్రూ డ్రాగ‌న్ క్యాప్సూల్‌కు ఎండీవ‌ర్ అని పేరు పెట్టారు. 45 ఏళ్ల త‌ర్వాత వ్యోమ‌గాములు నీటిలో దిగార‌ని, చాలా సంతోషంగా ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. 
 
ఇదిలావుండగా, అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన మొదటి వ్యాపారసంస్థగా ఎలాన్ మస్క్​కు చెందిన 'స్పేస్ ఎక్స్' రికార్డుపుటలెక్కింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫాల్కన్​ 9 రాకెట్​ సాయంతో ఇద్దరు వ్యోమగాములు బాబ్​ బెన్​కెన్​, డౌగ్​ హార్లేలను మే 30న నింగిలోకి వెళ్లారు. 19 గంటల ప్రయాణం అనంతరం వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరారు. ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా వీక్షించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments