Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది : శివసేన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న శివసేన ప్రధాని మోడీ వైఖరినచ్చక ఆ కూటమి నుంచి వైదొలగి, వచ్చే ఎన్నికల్లో స్వ

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (17:56 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న శివసేన ప్రధాని మోడీ వైఖరినచ్చక ఆ కూటమి నుంచి వైదొలగి, వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా, ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆ కూటమి నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ మంత్రిపదవులకు రాజీనామాలు చేయనున్నారు. 
 
ఈ పరిణామాలన్నింటిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, ఎన్డీయే నుంచి ఇక ఒక్కొక్క పార్టీ బయటపడుతుందన్నారు. ఈ పరిణామాలను శివసేన ముందుగానే ఊహించిందన్నారు. ఇతర పార్టీలు కూడా ఎన్డీయే నుంచి బయటికొస్తాయన్నారు. మిత్ర పక్షాలను బీజేపీ గౌరవించడం లేదన్నారు. బీజేపీతో మిత్రపక్షాల సత్సంబంధాలు ఇక ఎంతోకాలం కొనసాగబోవని జోస్యం చెప్పారు. క్రమంగా ఆ పార్టీల ఆగ్రహం పెచ్చుమీరుతుందని, అంతిమంగా కూటమి నుంచి వెళ్ళిపోతాయని అన్నారు. 
 
బీజేపీ తన మిత్రపక్షాలను గౌరవించడం లేదని శివసేనకు చెందిన మరో ఎంపీ అరవింద్ సావంత్ అన్నారు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని తెలుసుకుంటోందన్నారు. తాము ఈ విషయాన్ని చాలా కాలంగా చెప్తున్నామన్నారు. అందరినీ కలుపుకుంటామని బీజేపీ చెప్తూ ఉంటుందని, కానీ విధానాలను నిర్ణయించేటపుడు అటువంటి ప్రయత్నాలేవీ చేయదని ఆయన విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments