Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీళ్లంతా అంతేనా? అమ్మాయిలతో కనబడతారు... కోట్లతో పారిపోతారు

వేలకోట్లను ఒక్కదెబ్బతో హాంఫట్ అంటూ మింగేసి ఆ తర్వాత విదేశాలకు పారిపోవడం ఇటీవల మనదేశంలో కనబడుతోంది. నిజం చెప్పాలంటే వీళ్లంతా లిక్కర్ కింగ్ విజ‌య్ మాల్యా వార‌సులుగా చెప్పాల్సిందే. మాల్యా తన వ్యాపార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించేందుకు ప‌లు బ్యాంకులు వ‌ద్ద

వీళ్లంతా అంతేనా? అమ్మాయిలతో కనబడతారు... కోట్లతో పారిపోతారు
, శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:36 IST)
వేలకోట్లను ఒక్కదెబ్బతో హాంఫట్ అంటూ మింగేసి ఆ తర్వాత విదేశాలకు పారిపోవడం ఇటీవల మనదేశంలో కనబడుతోంది. నిజం చెప్పాలంటే వీళ్లంతా లిక్కర్ కింగ్ విజ‌య్ మాల్యా వార‌సులుగా చెప్పాల్సిందే. మాల్యా తన వ్యాపార కార్య‌క‌లాపాల్ని కొన‌సాగించేందుకు ప‌లు బ్యాంకులు వ‌ద్ద రూ.9 వేల‌కోట్ల రుణాలను పొందాడు. ఆ రుణాల్ని చెల్లించే స‌మ‌యానికి మాల్యా డ‌బ్బు క‌ట్ట‌కుండా మార్చి 2వ తేదీన దేశ విడిచి పారిపోయి, లండన్‌లో తలదాచుకుంటున్నాడు. 
 
తాజాగా మాల్యా వారసులుగా నలుగురు ఉన్నారనీ చెపుతున్నారు. వీరిలో లలిత్ మోడీ, దీప‌క్ త‌ల్వార్, సంజయ్ భండారీ, నిర‌వ్ మోడీలని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో లలిత్ మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను ప్రపంచానికి ప‌రిచ‌యం చేసిన ల‌లిత్ మోడీ ఐపీఎల్‌లో అక్ర‌మాలు, ఫెమా చ‌ట్టం ఉల్లంఘన వంటి కేసుల్లో చిక్కుకుని విదేశాలకు పారిపోయాడు. 
webdunia
 
ఇకపోతే, కార్పొరేట్ క‌న్స‌ల్టెంట్ అయిన దీప‌క్ త‌ల్వార్ ఎయిర్‌లైన్స్, ఏవియేష‌న్ కంపెనీల‌కు నిబంధ‌న‌లుకు విరుద్ధంగా మేలు చేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆదాయ పన్ను శాఖ నుంచి త‌ప్పించేందుకు యూఏఈ పారిపోయాడు. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ. ర‌క్ష‌ణ శాఖ కొనుగోళ్లు, పలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్టు తేలింది. ఈ ఒప్పందాలను ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. దీంతో నేపాల్ మీదుగా విదేశాలకు చెక్కేశాడు.
 
ఇక చివరగా, నిరవ్ మోడీ. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ వ‌జ్రాల వ్యాపారీ నిర‌వ్ మోడీ కూడా దేశంలో అతిపెద్ద రెండో బ్యాంకింగ్ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.11,436 కోట్లు కుంభకోణానికి తెర‌తీశాడు. ఈ స్కామ్ దేశ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. బయ్యర్స్ క్రెడిట్ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాల్ని పొందాడు. 
webdunia
 
అయితే నిర‌వ్ మోడీ బ్యాంకు లావాదేవీల‌పై అనుమానం వ్య‌క్తం చేసిన పీఎన్బీ ఉన్న‌తాధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కాం వెలుగులోకి వ‌చ్చింది. కేసు నిమిత్తం అత‌న్ని ప‌ట్టుకునేలోపే మోడీ స్విర్జ‌ర్లాండ్‌కు పారిపోయాడ‌ు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆయన నివాసాల్లో తనిఖీలు నిర్వహించి రూ.5000 కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారు ఆభరణాలు, వజ్రాలను సీజ్ చేశారు. ఐతే వాటి విలువ రూ. 100 కోట్లు కూడా వుండవనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిరవ్ మోదీని ఏకంగా ఆర్బీఐ గవర్నర్ చేయండంటూ శివసేన సెటైర్లు వేస్తోంది. మొత్తమ్మీద కోట్ల రూపాయల కుంభకోణాలకు తెరతీస్తున్నవీళ్లంతా అమ్మాయిలతో జల్సాలు చేయడం కామన్‌గా వుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెను రెండు భాగాలుగా చేశాడు... ఎలాగో తెలుసా(వీడియో)