Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూబీ రోమన్‌ ద్రాక్ష.. ఒక బంచ్ ధర రూ.33వేలు..

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (21:23 IST)
Grapes
ద్రాక్ష పండు తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. సాధారణంగా రెండు రకాల ద్రాక్షలు చూసి ఉంటారు. కానీ ద్రాక్షలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటి ధర సీజన్‌లో అయితే రూ.వంద పైన సాధారణ రోజుల్లో 40-80 మధ్య ఉంటుంది. అయితే ఒక ద్రాక్ష పండు రకం ధర మాత్రం ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది. ఒక్క పండు ధరనే రూ.30 వేలకు పైగా ఉంటుంది. ఆ పండు ఏ రకమో.. ఆ పండు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
 
రూబీ రోమన్‌ ద్రాక్షగా పిలిచే ఈ పండ్లు అత్యధిక ధర కలిగి ఉంటుంది. ఈ పండ్లు జపాన్‌లో మాత్రమే లభిస్తుంటాయి. ఆ దేశంలోని ఇషికావా అనే ప్రాంతంలో మాత్రమే లభించే ఈ రూబీ రోమన్‌ పండ్లుకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. 
 
ఈ ఎర్రని ద్రాక్ష గుత్తి ధర మాత్రమే 12 వేల డాలర్లు. భారత కరెన్సీలో అక్షరాల రూ .7.5 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం. ఒక్క ద్రాక్ష పండు ధర అయితే రూ. 35వేలకు పైగా ఉందట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా అది రికార్డు నమోదు చేసింది. ప్రతి సంవత్సం 24వేల రూబీ రోమన్ ద్రాక్ష గుత్తులు మాత్రమే సాగు చేయబడతాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments