జపాన్ దేశంలో కరోనా వైరస్ మరోమారు శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఒలింపిక్స్ క్రీడా పోటీలు జరిగే టోక్యో నగరంతో పాటు పలు ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం వైరస్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
ముఖ్యంగా, టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రధాని సుగ ప్రకటించారని జపాన్ ప్రధాని కార్యాలయం శనివారం వెల్లడించింది. హొక్కైడొ, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక ప్రాంతాలకు వైరస్ ప్రబలకుండా కఠిన చర్యలు చేపడతామని తెలిపింది.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని ప్రయాణాలకు దూరంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టు పీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది. కరోనా నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని కోరింది.
ఇపుడు టోక్యో నగరంలో జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడంతో ఒలింపిక్స్ పోటీల నిర్వహణపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రీడా గ్రామంలోకి వైరస్ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసున్నారు.