Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్యశ్రీ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా? వామ్మో ముగ్గురు మూడు పార్టీల్లో?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (10:48 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం జిల్లా చీడికాడ మండలంలోని అప్పలరాజపురానికి చెందిన గవిరెడ్డి దేముడుబాబు కుటుంబం గురించి తెలుసుకుంటే అందరూ షాకవుతారు. రాష్ట్రంలో హోరాహోరీగా తలపడుతున్న మూడు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైకాపా, జనసేనలకు ఈ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
 
దేముడుబాబుకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. దేముడు బాబు కుమార్తె సుజాత అలియాస్ రమ్య శ్రీ సినీనటి ఈమె సినిమాల్లో నటిస్తూనే.. తన పేరిట ఓ స్వచ్ఛంధ సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
 
రమ్యశ్రీ సోదరుడు సన్యాసినాయుడు దివంగత నేత హరికృష్ణ స్థాపించిన అన్న తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈసారి టికెట్ ఆశించిన ఆయనకు జగన్ మొండిచేయి చూపడంతో జనసేనలో చేరి మాడుగుల టికెట్ సంపాదించారు.
 
రమ్యశ్రీ మరో సోదరుడు రామానాయుడు 2009లో మాడుగుల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఈసారి మళ్లీ బరిలో ఉన్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందినవారు మూడు ప్రధాన పార్టీల్లో ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments