Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుల రోజు స్పెషల్.. ఆయనకు 67 ఏళ్లు.. ఆమెకు 24 ఏళ్లు..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (12:40 IST)
ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఈ జంట తేల్చేసింది. ఆయనకు 67 ఏళ్లైనప్పటికీ.. 24 ఏళ్ల యువతి పెళ్లి చేసుకుంది. ఈ లవ్‌స్టోరీ పంజాబ్‌లోనే పుట్టింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్, ధూరి సబ్ డివిజన్ పరిధికి చెందిన బలియాన్ గ్రామానికి చెందిన షంపేర్ (67), నవ్‌ప్రీత్ కౌర్ (24)లు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలనుకున్నారు. 
 
రెండు కుటుంబాల పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో చండీఘడ్‌లోని గురుద్వారాలో జనవరిలో తమ మనసుకు నచ్చినట్లు వివాహం చేసుకున్నారు. వీరి జీవితం చిలకాగోరింకల్లా హాయిగా సాగిపోతుంది. అయితే పెద్దల నుంచి తమకు ప్రాణహాని వుందని.. కోర్టును ఆశ్రయించారు. 
 
వీరి పిటిషన్‌ విచారించిన కోర్టు ఇద్దరూ మేజర్లు అయినందున ఇష్టప్రకారం పెళ్లి చేసుకుని జీవించే హక్కుందని, కావున నూతన జంటకు రక్షణ కల్పించాలని సంగ్రూర్‌, బర్నాలా జిల్లా ఎస్పీలను ఈ నెల 4వ తేదీన ఆదేశించింది. కాగా వీరి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Ramya: ఆ సన్నివేశాలను తొలగించాలి... కోర్టును ఆశ్రయించిన నటి రమ్య

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments