Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెల్లిని బస్తాలో మూట కట్టేస్తుంది.. తల పట్టుకుని గోడకేసి బాదేస్తుంది...

చెల్లిని బస్తాలో మూట కట్టేస్తుంది.. తల పట్టుకుని గోడకేసి బాదేస్తుంది...
, బుధవారం, 21 నవంబరు 2018 (13:21 IST)
సవతి తల్లికి వ్యతిరేకంగా 15 యేళ్ళ బాలుడు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. తన చెల్లిని సవతి తల్లి పెడుతున్న చిత్రహింసలను పూసగుచ్చినట్టు జడ్జికి వివరించాడు. దీంతో జడ్జి సైతం కళ్లు చెమర్చారు. చండీఘడ్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చండీఘడ్‌కు చెందిన జస్‌ప్రీత్ అనే మహిళను మన్మోహన్ అనే వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈయన మొదటి భార్య చనిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో ఐదేళ్ళ బాలికతో పాటు 15 యేళ్ళ కుమారుడు ఉన్నాడు. 
 
అయితే, మన్మోహన్ మొదటి భార్య పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సిన జస్‌ప్రీత్ వారిని పలు రకాలైన చిత్రహింసలకు గురిచేస్తూ వేధించసాగింది. ఈ విషయం భర్త మన్మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జస్‌ప్రీత్‌పై కేసు నమోదుకాగా కోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ విచారణ సమయంలో భర్త మన్మోహన్‌తోపాటు కుమారుడు కేసులో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జోషి వద్ద సాక్ష్యం చెప్పారు. కోర్టులో తన సవతి తల్లి చేసిన దురాగతాలను పూసగుచ్చినట్టు వివరించాడు. తన చెల్లిని తల్లి నిత్యం కొడుతుందని కోపంతో ఊగిపోతూ బస్తాలో మూట కట్టేస్తుందని తెలిపారు. ఒకసారైతే చెల్లి తలను పట్టుకుని గోడకేసి బాదేసిందని చెప్పాడు. 
 
అలాగే, భర్త మన్మోహన్ మాట్లాడుతూ, తన భార్య పిల్లలను కొడుతుంటే చాలాసార్లు ఆపానని చెప్పాడు. అయినప్పటికీ వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నాడు. కాగా, కుమార్తెను దారుణంగా సవతి తల్లి కొడుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియోను మన్మోహన్ రికార్డు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొమ్మలను పక్కనబెట్టండి.. ఈ రోజుకు మీ ఇద్దరికీ పెళ్లి..?