Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కీచక ప్రిన్సిపాల్‌ను చంపేశారు... ఎలాగంటే...

విహార యాత్ర పేరుతో విద్యార్థినిలను తన వెంట తీసుకెళ్ళి అత్యాచారం జరిపిన కీచక ప్రిన్సిపాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ హత్యను అడ్డుకునేందుకు వచ్చిన ఆయన భార్యపై కూడా దుండగులు కత్తితో దాడిచేసి

కీచక ప్రిన్సిపాల్‌ను చంపేశారు... ఎలాగంటే...
, మంగళవారం, 14 ఆగస్టు 2018 (09:05 IST)
విహార యాత్ర పేరుతో విద్యార్థినిలను తన వెంట తీసుకెళ్ళి అత్యాచారం జరిపిన కీచక ప్రిన్సిపాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ హత్యను అడ్డుకునేందుకు వచ్చిన ఆయన భార్యపై కూడా దుండగులు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పంజాబ్ రాష్ట్రంలోని సోలన్ జిల్లా ఖారుణి గ్రామానికి చెందిన భగత్ రాం షైనీ అనే వ్యక్తి తన ఇంట్లోనే శివాలిక్ సైన్స్ స్కూలు నిర్వహిస్తూ, ఈ పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు. భగత్ రాం తన భార్య నవజోత్ (49), మానసిక వికలాంగుడైన కుమారుడు గౌరవ్‌తో కలిసి స్కూలు ఆవరమలోనే ఓ గదిలో ఉంటూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ముగ్గురు విద్యార్థినిలను వెంటబెట్టుకుని భరత్ రాం ఒడిషా రాష్ట్ర విహార యాత్రకు వెళ్లాడు. అక్కడ ముగ్గురు బాలికలపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ వ్యవహారంపై ఛైల్డ్ హెల్ప్ లైన్‌కు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బాలికలపై ప్రిన్సిపాల్ అత్యాచారం కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. 
 
ఈ పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ తన భార్య, కుమారుడితో ఇంట్లో ఉండగా దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి రెండున్నర గంటలకు వచ్చి ప్రిన్సిపాల్ భగత్ రాంను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం అతని భార్య నవజోత్‌పై కూడా దాడి చేసి గాయపరిచారు. దీంతో తీవ్ర గాయాల పాలైన నవజోత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మానసిక వికలాంగుడైన గౌరవ్ మరో గదిలో నిద్రపోతుండగా ఈ ఘటన జరిగింది. 
 
ప్రిన్సిపాల్ బాలికలపై అత్యాచారం జరిపిన కేసుతో ఈ హత్యకు సంబంధముందని పోలీసులు భావిస్తున్నారు. అదేసమయంలో హత్య చేసిన దండుగులు చాలా తెలివిగా వ్యవహరించారు. వీరంతా జోరు వర్షం పడే సమయంలో మోటారుసైకిళ్లపై వచ్చి తమ పనిపూర్తి చేసి వెళ్లారు. దీంతో పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌కు జ్ఞానం లేదు... అసెంబ్లీ ఎగ్గొట్టి జీతాలు తీసుకుంటున్నారు : మంత్రి దేవినేని