Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం.. రేపిస్టుకు ఉరిశిక్ష

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన కామాంధుడుకి ఉరిశిక్ష విధిస్తూ సాగర్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా

Advertiesment
Madhya Pradesh
, ఆదివారం, 8 జులై 2018 (13:55 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన కామాంధుడుకి ఉరిశిక్ష విధిస్తూ సాగర్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత యేడాది మే నెల 21వ తేదీన ఓ కామాంధుడు తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు.
 
 
ఈ నేపథ్యంలో గత మే నెల 21వ తేదీన తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని దోషిగా తేల్చిన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలంటూ గతేడాది డిసెంబరు నెలలో మధ్యప్రదేశ్ సర్కారు ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసిన విషయం తెల్సిందే. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో ఏప్రిల్ 21న చట్టంగా మారింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దోషికి ఉరిశిక్ష పడడం ఇదే తొలిసారి.
 
కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తంచేశారు. ఈ తీర్పు నేరగాళ్లకు చెంపపెట్టు అవుతుందన్నారు. చిన్న పిల్లలపై అత్యాచారానికి పాల్పడేవారిని వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. హోంమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. ఇకపై అత్యాచారాలకు పాల్పడే వారి వెన్నులో వణుకుపుడుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడు ఓ స్టుపిడ్... ఉన్నాడని నిరూపిస్తే రాజీనామా : ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్