Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

9న నిర్భయ కేసు తుదితీర్పు.. నిందితులకు ఉరిశిక్ష ఖాయమా?

దేశాన్నేకాకుండా, ప్రపంచాన్ని సైతం నివ్వెరపరిచిన నిర్భయ లైంగిక దాడి కేసులో తుది తీర్పు సోమవారం వెలువడనుంది. తుదితీర్పును సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఈ కేసులోని నిందితులకు అపెక్స్ కోర్టు మరణశిక్షను ఖర

9న నిర్భయ కేసు తుదితీర్పు.. నిందితులకు ఉరిశిక్ష ఖాయమా?
, ఆదివారం, 8 జులై 2018 (10:07 IST)
దేశాన్నేకాకుండా, ప్రపంచాన్ని సైతం నివ్వెరపరిచిన నిర్భయ లైంగిక దాడి కేసులో తుది తీర్పు సోమవారం వెలువడనుంది. తుదితీర్పును సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఈ కేసులోని నిందితులకు అపెక్స్ కోర్టు మరణశిక్షను ఖరారు చేస్తుందా? లేక జీవితఖైదుగా మారుస్తుందా? అనేది సోమవారం తేలిపోనుంది.
 
ఢిల్లీకి చెందిన 23 యేళ్ళ వైద్య విద్యార్థినిపై 2012, డిసెంబర్ 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు దారుణంగా లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. 
 
ఈ కేసులో వీరిలో డ్రైవర్ రామ్‌సింగ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా, మైనర్ అయిన బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నిర్భయ సంఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలు వేలసంఖ్యలో రోడ్లెక్కి నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసి విచారణను వేగవంతం చేసింది. 
 
నిర్భయపై లైంగిక దాడికి పాల్పడిన ముఖేశ్, పాశ్వాన్, వినయ్‌శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌లను దోషులుగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించాయి. అయితే, తమ శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలంటూ ఇద్దరు నిందితులు గత యేడాది నవంబరులో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. 
 
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మే 5వ తేదీన ఈ కేసులో ఇరువురి వాదనలు ఆలకించింది. అనంతరం తన తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో తుదితీర్పు సోమవారం వెలువరించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి...