Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా సోషల్ మీడియా వైబో నుంచి తప్పుకున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 1 జులై 2020 (19:31 IST)
గాల్వాన్ లోయలో చైనా బలగాలదాడికి నిరసనగా డ్రాగన్ కంట్రీకి చెందిన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. దీంతో భారత్‌లో చైనాకు చెందిన టిక్ టాక్, హలో వంటి అనేక ప్రముఖ యాప్‌లన్నీ మూగబోయాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా సోషల్ మీడియా వెబ్‌సైట్ 'వైబో' నుంచి మోదీ తప్పుకున్నారు.
 
వైబో అకౌంట్‌లో గతంలో మోడీ పెట్టిన ఫొటోలు, కామెంట్లు, పోస్టులు, ప్రొఫైల్‌ ఫొటోతో సహా పూర్తి వివరాలను తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ పూర్తి బ్లాంక్‌గా కనిపిస్తోంది. అకౌంట్‌లోని సమాచారాన్ని తొలగించే వరకు ప్రధాని ఇప్పటివరకూ 115 పోస్టులు  చేశారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా డిలీట్‌ చేశారు. 
 
వైబోలో మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉండగా, వీరిలో ఎక్కువ మంది చైనీయులే కావడం గమనార్హం. 2015 నుంచి చైనాకు సంబంధించిన  విషయాలను మోడీ వైబోలోనే పంచుకునేవారు. ప్రధానిగా చైనాలో పర్యటించే ముందు 2015లో మోడీ వైబోలో అకౌంట్‌ తెరిచారు. 
 
'హలో చైనా! వైబో ద్వారా చైనా స్నేహితులతో మాట్లాడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని మోడీ ట్విటర్లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. చైనాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సోషల్ మీడియా వెబ్‌సైట్‌ను చాలా మంది చైనీయులు వినియోగిస్తున్నారు. గాల్వాన్ లోయ ఎఫెక్టు కారణంగా చైనాపై భారత్ సోషల్ మీడియా యుద్ధం ప్రారంభించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments