Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరాన్‌ పొట్ట చీల్చుకుని స్నేక్‌ హీల్‌ బయటకు వచ్చింది.. ఫోటో వైరల్

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (21:30 IST)
Snake Eel
ప్రఖ్యాత వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కెమెరాకు ఓ హెరాన్ పక్షికి సంబంధించిన ఫోటో చిక్కింది. ఈ ఫోటోలో హెరాన్ పొట్టభాగం నుంచి ఓ స్నేక్‌ఈల్‌ వేలాడుతూ కనిపించింది. అంటే అది హెరాన్‌ను పట్టుకోలేదు. నారాయణపక్షి కడుపును చీల్చుకొని బయటకు వచ్చింది. రెండూ గాలిలో తేలియాడుతూ కనిపించాయి.
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన సామ్ డేవిస్ (58) అనే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఈ నమ్మశక్యం కాని క్షణాన్ని తన కెమెరాలో బంధించాడు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 
 
డేవిస్‌.. గద్దలు, నక్కల ఫొటోలు బంధించేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, ఆకాశంలో ఎగురుతున్న స్నేక్‌ ఈల్‌, హెరాన్‌ కనిపించగానే క్లిక్‌మనిపించాడు. మొదట స్నేక్‌ఈల్‌.. హెరాన్‌ మెడపట్టుకొని ఉందని అనుకున్నాడట. ఇంటికెళ్లి ఫొటోలు చూసి తనే షాకయ్యాడు. 
 
హెరాన్‌ పొట్ట చీల్చుకుని స్నేక్‌ హీల్‌ బయటకు వచ్చినట్లు గుర్తించాడు. అయినా హెరాన్‌ బతికే ఉందని తను చెబుతున్నాడు. ఇదిలా ఉండగా, ఇలాంటివి ఎప్పుడూ తాము చూడలేదని వన్యప్రాణి సిబ్బంది తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments