యువతికి తొమ్మిది లక్షలు టిప్స్.. అంత డబ్బు ఎందుకిచ్చాడంటే..?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:18 IST)
న్యూయార్క్‌లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి ఓ కస్టమర్ ఏకంగా 13 వేల డాలర్లు (దాదాపు రూ. 9.42 లక్షలు) టిప్‌గా ఇచ్చి ఆమెను అవాక్కు చేశాడు. న్యూయార్క్‌లో లిల్లీస్ కాక్ టైల్ రెస్టారెంట్ పేరిట ఓ హోటల్ ఉండగా, అక్కడ ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్‌గా పని చేస్తోంది. ఆ హోటల్‌కు రెగ్యులర్‌గా వెళ్లే రాబిన్ స్కాల్ అనే కస్టమర్, ఆమెను చూసి, ఆమెకేదైనా సాయం చేయాలని భావించాడు. 
 
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పి, ఎంతో కొంత సాయం చేయాలని, తాను ఆమెకు డబ్బులు ఇచ్చి సాయపడతానని కోరాడు. ఈ పోస్ట్ పెట్టే సమయంలో ఓ 1000 డాలర్ల నిధిని సేకరించి, ఆమెకు ఇచ్చినా తనకు సంతోషమేనని రాబిన్ భావించాడు. అయితే, నిమిషాల వ్యవధిలోనే 13 వేల డాలర్లు పోగయ్యాయి. 
 
దీంతో ఆ డబ్బును తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన రాబిన్ స్కాల్, ఆమెకు మొత్తం తాను సేకరించిన మొత్తాన్ని టిప్‌గా ఇచ్చి వచ్చాడు. తొలుత నమ్మలేకపోయినా, ఆపై విషయం తెలుసుకున్న ఆమె, స్కాల్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఫాలోవర్లకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan: ఛాంపియన్ నుంచి మనసుని హత్తుకునే పాట సల్లంగుండాలే రిలీజ్

Harsha Chemudu: ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది : హర్ష చెముడు

Eesha Rebba: మా గర్ల్స్ గ్యాంగ్ లో నేను కూడా అలా ఉన్నాను: ఈషా రెబ్బా

Fariya: కొత్తగా కంటెంట్ వినగానే నటించాలని అనిపించింది : ఫరియా అబ్దుల్లా

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments